పరిమితి చట్రంలో గూగుల్‌ మీట్‌!

ABN , First Publish Date - 2021-07-17T06:18:10+05:30 IST

గూగుల్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ వేదిక ‘గూగుల్‌ మీట్‌’ను పర్సనల్‌(ఉచిత)అకౌంట్‌తో ఉపయోగించే వారికి నిజంగా ఇబ్బంది కలిగించే వార్తే. పరిమితి అంటూ లేకుండా గ్రూప్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం దీంతో ఇంతవరకూ ఉండేది.

పరిమితి చట్రంలో గూగుల్‌ మీట్‌!

గూగుల్‌ వీడియో కాన్ఫరెన్సింగ్‌ వేదిక ‘గూగుల్‌ మీట్‌’ను పర్సనల్‌(ఉచిత)అకౌంట్‌తో ఉపయోగించే వారికి నిజంగా ఇబ్బంది కలిగించే వార్తే. పరిమితి అంటూ లేకుండా గ్రూప్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయం దీంతో ఇంతవరకూ ఉండేది.  అయితే, ఫ్రీ గూగుల్‌ అకౌంట్‌తో ముగ్గురు లేదా అంతకుమించి పార్టిసిపెంట్స్‌తో సరిగ్గా గంట సేపు మాత్రమే ఇప్పుడు గూగుల్‌ మీట్‌లో మాట్లాడుకోవచ్చు. 55 నిమిషాలు కాగానే పరిమితి పూర్తికావచ్చిందన్న నోటిఫికేషన్‌ పార్టిసిపెంట్స్‌కు కనిపిస్తుంది. అయినప్పటికీ కాల్‌ వ్యవధిని పెంచుకోవాలని అనుకుంటే మాత్రం నిర్వాహకుడు తన గూగుల్‌ అకౌంట్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. ఫ్రీ గూగుల్‌ అకౌంట్‌ వినియోగదారులకు ఇప్పటివరకు ఉన్న 24 గంటల సేపు వన్‌ టు వన్‌ కాల్‌ సదుపాయంలో మార్పు లేదు. గత ఏడాది మార్చిలో జీ మెయిల్‌ వినియోగదారులకు గూగుల్‌ మీట్‌ ఉచితమని ప్రకటించింది. అప్పటి నుంచి పొడిగించుకుంటూ వచ్చింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు పొడిగింపు పర్వం కొనసాగింది. టైమ్‌ విషయంలో పరిమితి విధించకపోవడానికి ఎలాంటి కారణం చూపలేదు. తద్వారా  గూగుల్‌ మీట్‌ ఎక్కువ మంది  ఉపయోగించుకునేలా చూసుకుంది.

Updated Date - 2021-07-17T06:18:10+05:30 IST