నెట్‌ లేకుండా గూగుల్‌ మ్యాప్స్‌

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

మనం ఉండే నగరంలోనే కాదు, కొత్త పట్టణంలోనూ డ్రైవింగ్‌

నెట్‌ లేకుండా గూగుల్‌ మ్యాప్స్‌

మనం ఉండే నగరంలోనే కాదు, కొత్త పట్టణంలోనూ డ్రైవింగ్‌ సమయంలో  సహాయం చేయడంలో గూగుల్‌ మ్యాప్స్‌ విశేష పాత్ర పోషిస్తోంది. ఇబ్బందికర పరిస్థితుల్లో మార్గాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడుతోంది.  అన్నిట్లో మాదిరిగానే ఇందులోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. గూగుల్‌ ఇతర అప్లికేషన్స్‌ మాదిరిగానే ఇది కూడా ఇంటర్నెట్‌ సహకారంతోనే పనిచేస్తుంది. అయితే నెట్‌ సౌలభ్యం లేనప్పుడు కూడా మార్గాన్వేషణ కోసం ఉపయోగించుకునేందుకు కొన్ని టిప్స్‌


ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్లు రెంటిలోనూ ఆఫ్‌లైన్‌లోనూ గూగుల్‌ మ్యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. 

ఇన్‌కాగ్నిటో మోడ్‌(యాక్టివిటీ డేటా డివై్‌సలో సేవ్‌ కాలేదని అర్థం)లో కాకుండా ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయి ఉందన్న విషయాన్ని ముందు నిర్ధారణ చేసుకోవాలి. 

స్ర్కీన్‌పై రైట్‌ కార్నర్‌ టాప్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌ కనిపిస్తుంది. సెర్చ్‌ పానెల్‌లో టాప్‌ చేయండి.

మెనూలో ‘ఆఫ్‌లైన్‌ మ్యాప్స్‌’ కనిపిస్తుంది. ఆఫ్‌లైన్‌ మ్యాప్స్‌ కింద ‘సెలెక్ట్‌ యువర్‌ ఓన్‌ మ్యాప్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. 

అది మ్యాప్‌ని ఓపెన్‌ చేస్తుంది. డౌన్‌లోడ్‌ చేయాల్సిన స్థాయిలో జూమ్‌ లేదంటే బ్లూబాక్స్‌కు తగ్గట్టు అడ్జస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మళ్ళీ సెర్చ్‌కు అవకాశం ఉండదు. ఏరియాను సెలెక్ట్‌ చేసుకునే వీలు మాత్రమే ఉంటుంది. 

మ్యాప్‌ సెలెక్షన్‌ ఒకసారి పూర్తయిన తరవాత బ్లూబాక్స్‌ దిగువన డౌన్‌లోడ్‌ బటన్‌ను టాప్‌ చేయాలి.

అదంటూ జరిగితే చాలు, డౌన్‌లోడ్‌ చేసిన మ్యాప్‌ ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే హాయిగా ప్రయాణం సాగించవచ్చు. 


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST