యాపిల్‌ వాచీలోనూ గూగుల్‌ మ్యాప్స్‌

ABN , First Publish Date - 2022-06-04T08:47:13+05:30 IST

బైటకు వెళ్ళినప్పుడు మార్గాన్వేషణలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు గూగుల్‌ మ్యాప్స్‌ యాక్సెస్‌ ఎంతగానో మేలు చేస్తోంది.

యాపిల్‌ వాచీలోనూ గూగుల్‌ మ్యాప్స్‌

బైటకు వెళ్ళినప్పుడు మార్గాన్వేషణలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు గూగుల్‌ మ్యాప్స్‌ యాక్సెస్‌ ఎంతగానో మేలు చేస్తోంది. ఇప్పుడు ఆ సౌలభ్యం నేరుగా యాపిల్‌ వాచీలోనే పొందవచ్చు. అనువుగా వాచీ ఉంటే చాలు, గమ్యాన్ని ఇక సురక్షితంగా చేరుకోవచ్చు. అయితే యాపిల్‌ వాచీలో నేరుగా కొత్త లొకేషన్‌ను ఎంటర్‌ చేయలేం. అందుకోసం ఐఫోన్‌ను ఉపయోగించుకోవాలి. ఒకసారి నిర్దేశించుకుంటే ఇకపై యాపిల్‌ వాచీతో పని కానిచ్చేయవచ్చు. అందులో మేప్‌ ఏమీ కనిపించదు. దూరం, మలుపులు, డ్రైవ్‌ టైమ్‌, టర్న్‌ డైరెక్షన్‌ వంటివి హెప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌ ద్వారా అందుతుంటాయి. లొకేషన్స్‌ సేవ్‌ చేసుకోవచ్చు. షార్ట్‌కట్స్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఐఫోన్‌ లేకుండానే అప్పుడు సులువుగా వెళ్ళవచ్చు. 


యాపిల్‌ వాచీలో ఈ సదుపాయం కావాలని అనుకుంటే ముఖ్యంగా వాచ్‌ ఔస్‌5 లేదా అంతకుమించి, ఐఔస్‌ 10 లేదా అంతకుమించి, బ్లూటూత్‌ ఎనేబుల్డ్‌ అయి ఉండాలి. అలాగే ఈ వెసులుబాటు కోసం టర్న్‌ ఆన్‌ లొకేష్‌ సర్వీస్‌ని ఎప్పటికీ ఉంచుకోవాలి. ఇక మీ ఐఫోన్‌లో సెట్టింగ్స్‌ -ప్రైవసీ - లొకేషన్‌ సర్వీసెస్‌ - గూగుల్‌ మ్యాప్స్‌ ఉండాలి. ఎప్పటకీ అలౌ అన్నది మస్ట్‌.


డెస్టినేషన్‌ను సేవ్‌ చేసుకోవాలంటే

మీ యాపిల్‌ వాచీలో గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి పెట్టుకోవాలి. 

నేవిగేషన్‌ను ఆరంభించాలి.

వాచీపై గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి

కరెంట్‌ ట్రిప్‌ కింద ఈటీఏ ని టాప్‌ చేయాలి. 

Updated Date - 2022-06-04T08:47:13+05:30 IST