గూగుల్ ఫొటోస్‌లోకి ఈమెయిల్ ఫొటోలు.. ఇప్పుడు మరింత ఈజీ!

ABN , First Publish Date - 2021-05-28T01:20:43+05:30 IST

జీమెయిల్‌లోని ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లోకి పంపడం మరింత సులభతరం కానుంది. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్

గూగుల్ ఫొటోస్‌లోకి ఈమెయిల్ ఫొటోలు.. ఇప్పుడు మరింత ఈజీ!

న్యూఢిల్లీ: జీమెయిల్‌లోని ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లోకి పంపడం మరింత సులభతరం కానుంది. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ‘సేవ్ టు ఫొటోస్’ అనే బటన్‌ను యాడ్ చేయబోతోంది. ఈ ఫీచర్ వల్ల జీ మెయిల్‌లో వచ్చిన ఫొటోలను చాలా సులభంగా గూగుల్ ఫొటోస్‌లోకి పంపుకోవచ్చు. అయితే, ఇది పర్సనల్ జీమెయిల్ యూజర్లు, గూగుల్ వర్క్‌ఫోర్స్, జి సూట్ బేసిక్, జి సూట్ బిజినెస్ వినియోగాదారులకు మాత్రమే పరిమితం కానుంది.


వచ్చే రెండుమూడు వారాల్లో ఈ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న ‘యాడ్ టు డ్రైవ్’ బటన్‌తో పాటు ఇది కూడా కనిపించనుంది. అయితే, ఈ ఆప్షన్ జేపీఈజీ ఫొటోలకు మాత్రమే పనిచేస్తుంది. పీఎన్‌జీ ఫొటోలకు ఇది పనిచేయదు. 


గూగుల్ ఫొటోస్‌కు ఫొటోలను జోడించేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే జూన్ ఒకటి నుంచి గూగుల్ ఫొటోస్ స్టోరేజీ స్పేస్ మరింత తగ్గనుంది.  ‘హై క్వాలిటీ’ ఫొటోలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అపరిమిత స్టోరేజీ మాయమై దాని స్థానంలో 15 జీబీ స్టోరేజీ అందుబాటులోకి వస్తుంది. అంతకుమించి కావాలంటే మాత్రం కొనుక్కోవాల్సిందే. అయితే, ఈ మార్పు రాకముందు అప్‌లోడ్ చేసిన ఫొటోలకు ఈ పరిమితి వర్తించదు. కాబట్టి గూగుల్ ఫొటోస్‌లో మరిన్ని యాడ్ చేసుకునేందుకు ఇదే అనువైన సమయం.

Updated Date - 2021-05-28T01:20:43+05:30 IST