మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

ABN , First Publish Date - 2021-11-27T05:39:34+05:30 IST

గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ని ఉపయోగించడమే తప్ప వాటి పాస్‌వర్డ్‌ భద్రతపై చాలామందికి పట్టింపు ఉండదు. అసలు పాస్‌వర్డ్‌ని స్ట్రాంగ్‌గా ఏర్పాటు చేసుకున్నామా లేదా అన్నది కూడా తెలుసుకోరు...

మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ని ఉపయోగించడమే తప్ప వాటి పాస్‌వర్డ్‌ భద్రతపై చాలామందికి  పట్టింపు ఉండదు. అసలు పాస్‌వర్డ్‌ని స్ట్రాంగ్‌గా ఏర్పాటు చేసుకున్నామా లేదా అన్నది కూడా తెలుసుకోరు. నిజానికి డేటా భద్రంగా ఉండాలంటే పాస్‌వర్డ్‌ ప్రొటక్షన్‌ కీలకం. దరిమిలా, క్రోమ్‌ బ్రౌజర్‌ భద్రత విషయంలో మరో అడుగు ముందుకేసింది. ‘గూగుల్‌ క్రోమ్‌ పాస్‌వర్డ్‌ చెకర్‌’ పేరిట టూల్‌ ఒకటి ఏర్పాటు చేసింది. సేవ్‌, సింక్‌ అయిన పాస్‌వర్డ్‌ల స్టేటస్‌ను ఇది తెలియజేస్తుంది. సేవ్‌ చేసిన పాస్‌వర్డ్‌లను స్కాన్‌ చేస్తుంది. అలాగే పాస్‌వర్డ్‌ పటిష్ఠతపై కూడా వినియోగదారుడిని హెచ్చరిస్తుంది. 


క్రోమ్‌ చెక్‌


దీన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటే మొదట క్రోమ్‌ బ్రౌజర్‌ను అప్డేట్‌ చేసుకోవాలి. క్రోమ్‌ 96 లేదంటే సరికొత్త వెర్షన్‌ను అప్డేట్‌ చేసుకోవాలి. 


గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాలి. రైట్‌ కార్నర్‌ టాప్‌లో త్రీడాట్స్‌ ఆప్షన్‌లో ఇది ఉంటుంది. 


‘ఆటోఫిల్‌’పై క్లిక్‌ చేసి పాస్‌వర్డ్స్‌ని ఎంపిక చేసుకోవాలి. 


పాస్‌వర్డ్స్‌పై క్లిక్‌ చేయాలి. 


అది ఆటోమేటిక్‌గా హిస్టరీలో ఉన్న పాస్‌వర్డ్‌లను స్కాన్‌ చేస్తుంది. కాంప్రమైజ్‌ అలాగే వీక్‌ పాస్‌వర్డ్స్‌ ప్రాతిపదికగా విభజిస్తుంది. మీ పాస్‌వర్డ్‌ కాంప్రమైజ్‌ కేటగిరిలో ఉంటే మార్చుకోండని సూచిస్తుంది.  


స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌


నోర్డ్‌పాస్‌ స్టడీ ప్రకారం భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగించే పాస్ట్‌వర్డ్‌ల జాబితా విడుదలైంది. 123456, 123456789 చుట్టూ ఆ నంబర్లన్నీ తిరిగాయి. వీటన్నింటినీ సెకను లోపే క్రాక్‌ చేయవచ్చని కూడా నోర్డ్‌పాస్‌ తెలిపింది. ఆ కారణంగా యూనిక్‌ పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం చాలా మంచిది. కనీసం 12 క్యారెక్టర్లు ఉండాలి. వింటున్న పాట, లేదంటే చదువుతున్న పుస్తకంలోనుంచి నచ్చిన పదం తీసుకుని సెట్‌ చేసుకుంటే మంచిది. దానికి అంకెలు, హ్యాష్‌టాగ్‌ కూడా చేర్చుకోవచ్చు. కామన్‌ నిక్‌ నేమ్‌ కుటుంబ సభ్యులు లేదంటే అందరికీ లభ్యమయ్యే సమాచారంతో పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడం ఏమంత శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-11-27T05:39:34+05:30 IST