గూగుల్ డూడుల్‌లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన అద్భుత చిత్రం

ABN , First Publish Date - 2022-07-13T17:09:06+05:30 IST

గూగుల్ తాజాగా నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్...

గూగుల్ డూడుల్‌లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన అద్భుత చిత్రం

గూగుల్ తాజాగా నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యుఎస్టీ) తీసిన విశ్వంనకు సంబంధించిన డీప్ ఇమేజ్‌ను డూడుల్‌గా మలచింది. ఇది అద్భుత ఆవిష్కారం. శాస్త్రవేత్తలు 'గోల్డెన్ ఐ' అని పిలుస్తారు. గూగుల్ డూడుల్.. అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెబ్ స్పేస్ టెలిస్కోప్‌కు చెందిన 5 ఫోటోలను షేర్ చేసింది. ఈ చిత్రాలను స్లయిడ్ డూడుల్ చేయడం ద్వారా గూగుల్ షేర్ చేసింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుండి తీసిన ఈ చిత్రాలలో అంతరిక్ష వాతావరణం చూపించారు. 



జేడబ్ల్యుఎస్టీ ఆకాశంలో అతిపెద్దది, ప్రకాశవంతమైన నెబ్యులాలలో ఒకటైన కారినా నెబ్యులాకు చెందిన అద్భుతమైన చిత్రాలను  బంధించింది. విశేషమేమిటంటే, జేమ్స్ వెబ్ స్పేస్ అత్యంత సంక్లిష్టమైన ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్. శ్వేతసౌధంలో ఈ తొలి ఫొటోను ఆవిష్కరించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. ‘‘విశ్వ చరిత్రలో ఇది అద్భుత ఘట్టం అని పేర్కొన్నారు.  ఇంతకు ముందు ఎవరూ చూడని ప్రదేశాలను  చూడవచ్చు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాసా నిర్వాహకుడు బిల్ నెల్సన్ మాట్లాడుతూ విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాలని మనకు తెలుసు. ఈ చిత్రం 4.6 బిలియన్ సంవత్సరాల నాటి స్టార్ గ్రూప్ SMACS 0723కి చెందినదని అన్నారు. ఈ నక్షత్రాల ద్రవ్యరాశి గురుత్వాకర్షణ లెన్స్ లాగా పని చేస్తుంది, గెలాక్సీ నుండి వచ్చే కాంతిని నాలుగు దిశలలో వ్యాపిస్తుందన్నారు. ఫ్రెంచ్ గయానాలోని గయానా స్పేస్ సెంటర్ నుంచి 2021 డిసెంబర్ 25న టెలిస్కోప్‌ను ప్రయోగించారు. భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల (940,000 మైళ్ళు) దూరంలో ఉన్న దాని కక్ష్యను చేరుకోవడానికి ఒక నెల పట్టింది.

Updated Date - 2022-07-13T17:09:06+05:30 IST