అందమైన అనుభూతి కోసం గూగుల్‌ క్రోమ్‌ థీమ్స్‌

ABN , First Publish Date - 2021-09-18T06:17:20+05:30 IST

ప్రొఫెషనల్స్‌ నుంచి స్టూడెంట్స్‌ వరకు అంతా చాలావరకు గూగుల్‌ క్రోమ్‌ వినియోగదారులే. అదేవిధంగా చాలాకాలంగా ఉపయోగిస్తున్న క్రోమ్‌ను తనదిగా చేసుకోవాలన్న కోరిక...

అందమైన అనుభూతి కోసం గూగుల్‌ క్రోమ్‌ థీమ్స్‌

ప్రొఫెషనల్స్‌ నుంచి స్టూడెంట్స్‌ వరకు అంతా చాలావరకు గూగుల్‌ క్రోమ్‌ వినియోగదారులే. అదేవిధంగా చాలాకాలంగా ఉపయోగిస్తున్న క్రోమ్‌ను తనదిగా చేసుకోవాలన్న కోరిక ఉండటం చాలా సహజం. ఎవరికి వారు కస్టమైజ్‌ చేసుకునేందుకు అంటే ఈ క్రోమ్‌ సొంతం అని భావన కలిగించేందుకు ఇందులో అనేకానేక థీమ్స్‌ ఉన్నాయి. వాటి సహకారంతో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఎవరికి వారు తమకు నచ్చిన పద్ధతిలోకి మలుచుకోవచ్చు. స్టయిల్స్‌, మూడ్స్‌కు తోడు జంతువులు, ఆర్ట్‌, పర్వతాలు, రంగులు సహా ఎన్నో థీమ్స్‌ను గూగుల్‌ తీసుకువచ్చింది. ఎక్కువ మంది యూజర్లు ఉపయోగించే థీమ్స్‌ ఇవి. 


ఫ్లయింగ్‌ పెయింట్‌

లుక్‌ను మరింత బ్రైట్‌(కాంతిమంతం)గా చేసుకునేందుకు వీలుగా కలర్‌ఫుల్‌ థీమ్స్‌ ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ ఫ్లయింగ్‌  పెయింట్‌ ఒకటి. కలర్‌ఫుల్‌ అనుభవానికి ఇది తోడ్పడుతుంది. 


మెటీరియల్‌ డార్క్‌

డార్క్‌ మోడ్‌లో మీ యాప్‌లు ఉండాలని అనుకుంటే అందుకు చక్కగా ఇది ఉపయోగపడుతుంది. క్రోమ్‌ స్టోర్‌లో చాలా రకాల డార్క్‌ థీమ్స్‌ ఉన్నాయి.  వీటిని లక్షల మంది ఉపయోగించుకున్నారు. బ్రౌజర్‌తో గంటలకొద్దీ పనిచేసుకునేందుకు ఇది చాలా బాగా తోడ్పడుతుంది. 


బ్లూ/ గ్రీన్‌ క్యూబ్స్‌

కలర్‌ఫుల్‌ క్యూబ్స్‌తో అనుభవాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. సంపూర్ణంగా అందమైన ఆకారాల్లో అందుబాటులో ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది క్రోమ్‌కు సంబంధించి అతి సాధారణ, సౌందర్యసహిత థీమ్‌. 


ల్యాండ్‌స్కేప్‌ థీమ్‌ 

అందమైన సీనరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు! ఇది  పూర్తిగా రంగురంగులతో కలగలిసినది, అందరికీ నచ్చేవిధంగా ఉంటుంది. ఇందులో ఒరిజినల్‌ బొమ్మలను సహజత్వం అంతకుమించి అందంగా అందిస్తారు.


స్పేస్‌/ గెలాక్సీ థీమ్‌

ఇది డార్క్‌ మోడ్‌కు కొనసాగింపు. హోమ్‌ స్ర్కీన్‌లోనే గెలాక్సీ ఎఫెక్ట్‌లను ఎంజాయ్‌ చేయవచ్చు. దీంతో యూజర్లు తమ కంప్యూటర్ల నుంచే నక్షత్ర మండలాన్ని చూడవచ్చు. 


Updated Date - 2021-09-18T06:17:20+05:30 IST