Advertisement
Advertisement
Abn logo
Advertisement

అపరిమిత స్టోరేజీకి గూగుల్‌ చెక్‌!

ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ వినియోగదారులు ఇప్పటివరకు పొందుతున్న అపరిమిత స్టోరేజ్‌ స్పేస్‌కు చెక్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాట్‌ బ్యాకప్స్‌ కోసం ప్రత్యేకించిన స్పేస్‌లో కొంత మేరకు గూగుల్‌ తీసుకుంటుందని వార్తలు వినవస్తున్నాయి. 

డబ్ల్యుఎబేటాఇన్ఫో ప్రకారం గూగుల్‌ డ్రైవ్‌లో వాట్సాప్‌ చాట్‌ బ్యాకప్‌ ఎంత స్పేస్‌ తీసుకుంటోందో లెక్కించడం ప్రారంభించారు. అన్‌లిమిటెడ్‌ స్పేస్‌ను తీసేసి ఒక్కో వినియోగదారుడికి 2000 ఎంబి లేదా 2 జీబీ స్పేస్‌ను మాత్రమే కేటాయిస్తుంది.  

ఈ కొత్త ప్లాన్‌ను రాబోయే వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది.  ఇదే జరిగితే గూగుల్‌ ఫొటోస్‌ తరవాత స్పేస్‌ తగ్గించిన రెండో వేదిక వాట్సాప్‌ కానుంది. ఈ మార్పుతో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఉండడానికి ‘మేనేజ్‌ బ్యాకప్‌ సైజ్‌’ అనే కొత్త ఫీచర్‌ తీసుకురానున్నట్టు సమాచారం. దీనిద్వారా బ్యాకప్‌ ఫైల్‌ సైజ్‌ని మేనేజ్‌ చేసుకునే ఆప్షన్‌ కల్పించనుంది. ఫొటోలు, ఆడియో, వీడియోలు, డాక్యుమెంట్లను కలుపుకొవడం, తగ్గించుకోవడం,  వదిలించుకునే వెసులుబాటు దీంతో లభిస్తుందని సదరు బ్లాగ్‌సైట్‌ షేర్‌ చేసిన స్ర్కీన్‌ షాట్‌లు తెలియజేస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.21.21.7.కు బేటాలో లభిస్తుంది. యాప్‌ అంటూ ఒకసారి డెవలప్‌ చేస్తే చాలు కంపెనీ మెయిన్‌ యాప్‌లోనే ఇది అందుబాటులోకి వస్తుంది. 

Advertisement
Advertisement