ఆసక్తికర విషయం చెప్పిన Google బాస్ Sundar Pichai.. చెన్నైలో..

ABN , First Publish Date - 2022-05-08T23:56:28+05:30 IST

న్యూఢిల్లీ : ఆల్ఫాబెట్, Google Ceo Sundar Pichai ఎట్టకేలకు చెన్నైలో ఏ స్కూల్లో విద్యాభ్యాసం చేశారో చెప్పారు.

ఆసక్తికర విషయం చెప్పిన Google బాస్ Sundar Pichai.. చెన్నైలో..

న్యూఢిల్లీ: ఆల్ఫాబెట్, Google Ceo Sundar Pichai ఎట్టకేలకు చెన్నైలోన ఏ స్కూల్లో విద్యాభ్యాసం చేశారో గుట్టువిప్పారు. చెన్నైలోని వన వాణి స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లోపల ఈ స్కూల్ ఉంటుందని వివరించారు. ఇంటివద్దే చదువుకున్నాననే ప్రచారాన్ని కొట్టిపారేశారు. అది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. తన వికీపిడియా పేజీ సమాచారంలో అనేక విషయాలు నకిలీవి ఉన్నాయని తెలిపారు. కాగా పిచాయ్ వికీపిడియా పేజీకి సంబంధించి చెన్నైలో ఆయన విద్యాభ్యాసానికి సంబంధించిన స్కూల్స్ జాబితా చాలా పొడవుంది. కానీ ఇందులో 2 స్కూల్స్ మాత్రమే నిజమని సుందర్ పిచాయ్ వెల్లడించారు. అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానంగా చెన్నైలో చదవిన స్కూల్ వివరాలను తెలిపారు.


కాగా చెన్నైలోని అనేక స్కూళ్లు అడ్మిషన్లు ఆకర్షించేందుకుగానూ సుందర్ పిచాయ్ తమ స్కూల్లోనే చదివాడనే చెప్పే ప్రయత్నం చేశాయి. సుందర్ పిచాయ్ వికీపిడియా పేజీలోనూ ఈ గందరగోళం కనిపిస్తుంది. చెన్నైలో పిచాయ్ స్కూలింగ్ కు సంబంధించిన స్కూల్స్ జాబితా చాలా పొడవుంటుంది. 2015లో గూగుల్ సీఈవోగా పిచాయ్ బాధ్యతలు చేపట్టాక కేవలం వారం వ్యవధిలోనే ఆయన వికీపిడియా పేజీ 350 సార్లు సవరణలకు గురయ్యింది. 


కాగా 2019లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కు కూడా సుందర్ పిచాయ్ సీఈవోగా నియమితులయ్యారు. టెక్ రంగంలో అగ్రస్థాయి వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు. ప్రపంచ టాప్ 100 ప్రభావశీల వ్యక్తుల జాబితాలోనూ ఆయన స్థానం సంపాదించుకున్నారు. కాగా సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్ పూర్ లో బీటెక్ పూర్తి చేశారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎంబీఏ పూర్తి చేశారు. 2008లో క్రోమ్  బ్రౌజర్ ప్రారంభించిన టీంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. అంతక్రితం సుందర్ పిచాయ్ పలు సెర్చ్ ప్రొడక్టులపై పనిచేశారు. ఇందులో గూగుల్ టూల్ బార్, డెస్క్ టాప్ సెర్చ్, గాడ్జెట్స్, గూగుల్ గేర్స్ అండ్ గాడ్జెట్స్ ఉన్నాయి. గూగుల్ లో చేరడానికి ముందు సుందర్ పిచాయ్ మాన్యూఫ్యాక్చరర్ అప్లయిడ్ మెటీరియల్స్ లో ఇంజనీర్ గా పనిచేశారు. 

Read more