Google Play Storeలో Third-Party Call Recording Appకు కాలం చెల్లింది. కాల్ రికార్డింగ్ యాప్స్‌కు సంబంధించి Google సంస్థ గత నెలలో తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ప్లే-స్టోర్‌లో ఇన్నాళ్లూ అందుబాటులో ఉన్న అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు గూగుల్ గత నెలలో పేర్కొంది. ఇన్-బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉన్న ఫోన్లపై గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎలాంటి నష్టం లేదు.
అలా కాకుండా.. ఫోన్‌లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేని కారణంగా ప్లే-స్టోర్ నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని భావిస్తున్న వారికి మాత్రం ఇవాళ నుంచి ఆ అవకాశం ఉండదు. కొన్ని సంవత్సరాల నుంచి కాల్ రికార్డింగ్ యాప్స్‌ను గూగుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యూజర్ల భద్రతకు ఈ కాల్ రికార్డింగ్స్ కారణంగా భంగం కలుగుతోందనేది గూగుల్ వాదన. అయితే.. Google Own Dailer Appలో ఇప్పటికీ “this call is now being recorded” అనే అలర్ట్ కాల్‌లో ఉన్న ఇద్దరికీ వినిపించిన అనంతరం ఆ కాల్ రికార్డ్ అవుతుంది.
ప్లే-స్టోర్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌పై గూగుల్ విధించిన నిషేధం కేవలం Third-Party Appsకు మాత్రమే వర్తిస్తుంది. అంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Dailer, ఆ యాప్‌లో కాల్ రికార్డింగ్ అవకాశం ఇప్పటికీ అందుబాటులో ఉన్నట్టే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇంత కాలం అందుబాటులో ఉన్న థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్‌ను మాత్రమే తొలగించాలనే నిర్ణయానికి గూగుల్ వచ్చిందనేది ఈ పరిణామంతో స్పష్టమైంది. థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్‌ను గూగుల్ బ్యాన్ చేసిన మరుసటి రోజే Truecaller కూడా కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు పేర్కొంది. అప్‌డేట్ అయిన గూగుల్ డెవలపర్ ప్రోగ్రాం పాలసీల ప్రకారం తమ యాప్‌లో ఇక మీదట కాల్ రికార్డింగ్స్ సదుపాయం అందుబాటులో ఉండదని ట్రూకాలర్ స్పష్టం చేసింది.