Viral News: 3000 మేకలకు జాబ్ ఇచ్చిన Google.. అవి చేయాల్సిన డ్యూటీ ఇదేనట!

ABN , First Publish Date - 2022-09-11T18:05:59+05:30 IST

టెక్ దిగ్గజం Google. దీని గురించి ప్రస్తుతం తెలియని వాళ్లు లేరనే చెప్పొచ్చు. ఈ టెక్ దిగ్గజానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Google సుమారు 3వేల మేకలకు ఉద్యోగాలు క

Viral News: 3000 మేకలకు జాబ్ ఇచ్చిన Google.. అవి చేయాల్సిన డ్యూటీ ఇదేనట!

ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం Google. దీని గురించి ప్రస్తుతం తెలియని వాళ్లు లేరనే చెప్పొచ్చు. ఈ టెక్ దిగ్గజానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Google సుమారు 3వేల మేకలకు ఉద్యోగాలు కల్పించిందనేది ఆ వార్త సారంశం. ఏంటి షాకవతున్నారా? గూగుల్ ఏంటి మేకలను నియమించుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నమ్మశక్యంగా లేకున్నా.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వార్త ఇదే చెబుతోంది. ఈ నేపథ్యంలో అసలు గూగుల్‌కు అన్ని వేల మేకలతో ఏం పని పడింది? గూగుల్ ఆఫీస్‌లో మనుషులు చేయలేని పని మేకలు ఏం చేస్తాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. 



ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువతి, యువకులు.. దిగ్గజ టెక్ సంస్థల్లో పని చేయాలని కలలు కంటారు. యువత పని చేయాలని కలలుగనే సంస్థల్లో గూగుల్ కూడా ఒకటి. ఇంతటి గొప్ప సంస్థ.. కాలిఫోర్నియా(Califonia)లోని హెడ్‌క్వార్టర్స్ క్యాంపస్‌లో సుమారు 3500 మేకల(Goats)ను అద్దె తీసుకుని వాటికి పని కల్పించిందట. హెడ్‌క్వార్టర్స్ చుట్టూ విస్తరించి ఉన్న బహుళ ఎకరాల్లోని పచ్చిక బయళ్లను సజావుగా నిర్వహించడానికి(ఒక విధంగా గడ్డి మేయడానికి అని చెప్పొచ్చు) మేకలను నియమించారట. 


పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించి.. Google ఈ పని చేసిందట. బహుళ ఎకరాల్లో పెరిగే గడ్డి, మొక్కలను పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే మెషిన్లతో కట్ చేయడం ద్వారా ఎంతో కొంత పర్యావరణానికి హాని కలుగుతుందని ఆలోచించిందట. అందుకే సహజ సిద్ధ పద్ధతిలో పచ్చిక బయళ్ల నిర్వహణకు Google మేకలను హయర్ చేసుకుందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో.. నెటిజన్లు ఆశ్చర్యం వక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-09-11T18:05:59+05:30 IST