Resign to TRS: టీఆర్‌ఎస్‌కు షాక్... ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌తోనే ఉన్న నేత రాజీనామా

ABN , First Publish Date - 2022-07-30T17:34:52+05:30 IST

టీఆర్ఎస్ సీనియర్ నేత, షిప్ అండ్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ పార్టీకి గుడ్ బై చెప్పారు.

Resign to TRS: టీఆర్‌ఎస్‌కు షాక్... ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌తోనే ఉన్న నేత రాజీనామా

హనుమకొండ: అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS party) మరో షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వెంట నడిచిన సీనియర్ నేత, షిప్ అండ్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ (Kannaboina rajaiah yadav) పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆత్మగౌరం లేని టీఆర్ఎస్ పార్టీలో ఉండలేకపోతున్నట్లు సీనియర్ నేత  తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్ల నుంచి సీఎం కేసీఆర్‌ (KCR)తో కలిసి నడిచిన నేతగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. నాటి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరుగురు సీనియర్ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య ఒకరుగా నిలిచారు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్ట్ అయి ఖమ్మం జైలులో కేసీఆర్‌తో కలిసి ఉన్న నేతల్లో రాజయ్య యాదవ్ కూడా ఉన్నారు.


టీఆర్ఎస్‌లో ఆత్మగౌరవం లేదు: రాజయ్య

రాజీమానామాపై మీడియాతో మాట్లాడిన రాజయ్య...టీఆర్ఎస్‌లో ఆత్మగౌరవం లేదన్నారు. ఆత్మగౌరవం లేని టీఆర్ఎస్‌లో ఉండలేకపోతున్నట్లు తెలిపారు. సాధించిన తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందన్నారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు భవిష్యత్ లేదని చెప్పారు. వాపును బలుపు అనుకుని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని విమర్శించారు. 22 సంవత్సరాల టీఆర్ఎస్ అనుబంధాన్ని తెంచుకున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భవిషత్ కార్యాచరణను ప్రకటిస్తానని కన్నెబోయిన రాజయ్య యాదవ్ వెల్లడించారు. 

Updated Date - 2022-07-30T17:34:52+05:30 IST