టెస్టులకు రుబెల్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2022-09-20T09:43:18+05:30 IST

బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ రుబెల్‌ హుస్సేన్‌ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

టెస్టులకు రుబెల్‌ గుడ్‌బై

ఢాకా: బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ రుబెల్‌ హుస్సేన్‌ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం ఆడతానని సోషల్‌ మీడియా ద్వారా స్పష్టం చేశాడు. 2009లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టెస్టు అరంగేట్రం చేసిన 32 ఏళ్ల రుబెల్‌.. చివరిగా 2020లో పాకిస్థాన్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌ మ్యాచ్‌ ఆడాడు. అతను 27 టెస్టుల్లో 36 వికెట్లు తీశాడు. 

Updated Date - 2022-09-20T09:43:18+05:30 IST