Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలతో సత్ఫలితాలు

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి


ఆమనగల్లు: రాష్ట్రాభివృద్ధి, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయాలు, సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.2.15 లక్షలు మంజూర య్యాయి. బుధవారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో అశోక్‌రెడ్డి, రాములు, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, యాదగిరిరెడ్డి,రామచంద్రారెడ్డి, హరికిషన్‌, రమేశ్‌, శ్రీకాంత్‌రెడ్డి, హన్మనాయక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రముఖ కాంట్రాక్టర్‌ జనార్ధన్‌రెడ్డి సంస్మరణ సభలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో యాచారం వెంకటేశ్వర్లుగౌడ్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, యాదిరెడ్డి, రఘురాములు, రవీందర్‌రెడ్డి, డాక్టర్‌ రాంరెడ్డి, యాదయ్య, పాల్గొన్నారు. 

Advertisement
Advertisement