Abn logo
Sep 21 2021 @ 00:52AM

మాకవరపాలెంలో మంచి ఫలితాలు

సమావేశంలో మాట్లాడుతున్న రామునాయుడు


  టీడీపీ నేత ‘అల్లు’ వెల్లడి  

  16 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు చోట్ల  సైకిల్‌కు పట్టం  

  భవిష్యత్తు తమదేనని ధీమా

మాకవరపాలెం, సెప్టెంబరు 20 : ప్రాదేశిక ఎన్నికల్లో మండలంలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నాయకుడు, శెట్టిపాలెం సర్పంచు, భీమబోయినపాలెం ఎంపీటీసీ అల్లు రామునాయుడు అన్నారు. టీడీపీ నుంచి గెలుపొందిన అభ్యర్థులతో సోమవారం ఇక్కడ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు టీడీపీ వైపు  ఉన్నారని, ఇందు ప్రాదేశిక ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. 16 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏడు స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెంది ఉన్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలించాలన్న పట్టుదలతో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రగతి చంద్రబాబుతోనే సాధ్యమని అంతా మరోసారి గట్టిగా నమ్ముతున్నట్టు చెప్పారు.  కొన్నిచోట్ల అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయినా గతం కంటే ఇప్పుడు టీడీపీ బాగా పుంజుకుందన్నారు. అలాగే అధికార యంత్రాగం బాగానే సహకరించందన్నారు. ఈ సమావేశంలో దుంగలవానిపాలెం, భీమబోయినపాలెం, బూరుగుపాలెం, రాచపల్లి సర్పంచులు దుంగల రమణ, రుత్తల కిశోర్‌, రుత్తల యర్రాపాత్రుడు, ఆర్‌ఐ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.