సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై.. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్వీటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, అనురాగ్ కంచర్ల నిర్మిస్తోన్న చిత్రం 'సైకో వర్మ'. 'వీడు తేడా..' అనేది ట్యాగ్ లైన్. నిర్మాత, దర్శకుడైన నట్టి కుమార్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ చిత్రంతో మెగా ఫోన్ పట్టారు. అంతేకాదు ఆయన కొడుకుని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నాడు. నట్టి క్రాంతి, కృష్ణ ప్రియ, సంపూర్ణ మలకర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి నూతన సంవత్సరం సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఓ సాంగ్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ సందర్భంగా డైరెక్టర్ నట్టికుమార్ మాట్లాడుతూ.. ''సైకో వర్మ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి' అంటూ సాగే లిరికల్ పాటను నూతన సంవత్సర కానుకగా విడుదల చేశాము. పాటకి చాలా మంచి స్పందన వస్తోంది. సైకో వర్మ సినిమాలో నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్నాడు. తను చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని తెలుపుతూ అందరూ ఫోన్లు చేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ మాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. గతంలో మేము ఒక సాంగ్ మేకింగ్ వదిలాము. ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్‌కి కూడా చాలా మంచి స్పందనతో పాటు, ప్రశంసలు కూడా అందుతున్నాయి. పాట సక్సెస్‌తో అంతా సంతోషంగా ఉన్నాము..'' అని తెలిపారు.