Canada: స్టడీ పర్మిట్‌ కోసం ఎదురుచూస్తున్న భారతీయ విద్యార్థులకు కెనడా గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2022-08-20T13:31:33+05:30 IST

భారత్‌ నుంచి ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలు వెళ్లే విద్యార్థులు వీసాల కోసం వారాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.

Canada: స్టడీ పర్మిట్‌ కోసం ఎదురుచూస్తున్న భారతీయ విద్యార్థులకు కెనడా గుడ్‌న్యూస్

వీసా మంజూరులో ఆలస్యాన్ని తగ్గించడానికి కృషి: కెనడా

న్యూఢిల్లీ, ఆగస్టు 19: భారత్‌ నుంచి ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలు వెళ్లే విద్యార్థులు వీసాల కోసం వారాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. స్టడీ పర్మిట్‌ రావడం కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 వారాలు పడుతోంది. ఈ ఏడాది దేశంలో ఆ సమయం మరింత పెరిగింది. దీనిపై దేశంలోని కెనడా హై కమిషన్‌ వరుస ట్వీట్లతో స్పందించింది. ‘‘కెనడాలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువుల అడ్మిషన్లు పొంది స్టడీ పర్మిట్‌ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరాశా, నిస్పృహలను మేం అర్థం చేసుకోగలం. ఈ ఏడాది అనూహ్యంగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. సంవత్సరం పొడవునా మేం దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తూనే ఉన్నాం. వాటితోపాటే 2022 సెప్టెంబరులో తరగతులకు హాజరుకావాల్సిన విద్యార్థుల దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. ప్రతి వారం వేలాది మంది భారతీయ విద్యార్థులకు వీసాలను అందిస్తున్నాం. ఇప్పటికీ వీసాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వెంటనే కెనడాలోని తమ విద్యాలయాలను సంప్రదించాలి’’ అని హై కమిషన్‌ విజ్ఞప్తి చేసింది. 

Updated Date - 2022-08-20T13:31:33+05:30 IST