Abn logo
May 7 2020 @ 00:00AM

గుడ్ న్యూస్: ‘ఇండియన్ 2’ ఆగిపోలేదు

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా.. సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్ ‘ఇండియన్ 2’ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే సెట్‌లో భారీ ప్రమాదం సంభవించడంతో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ప్రమాద ఘటనపై కేసులు గట్రా నమోదవ్వడంతో.. అవన్నీ పూర్తయ్యి మళ్లీ ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం కష్టమే అనుకుంటున్న సమయంలో.. అసలీ చిత్రమే ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. మధ్యలో కమల్ హాసన్, లైకా వారికి మధ్య సీరియస్‌గా లేఖలు నడవడం కూడా సినిమా ఆగిపోయిందనే వార్తలకు బలాన్నిచ్చాయి. ఈలోపు కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ మొత్తం ఆగిపోవడంతో ఈ సినిమాపై సరైన క్లారిటీ లేదు. 


ఇక ఈ చిత్రం ఆగిపోయిందనే అంతా అనుకుంటున్న సమయంలో.. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ఈ చిత్రం ఆగిపోలేదని, ప్రస్తుత లాక్‌డౌన్ పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభిస్తామని అధికారికంగా లైకా సంస్థ ప్రకటించింది. చిత్రీకరణ 60 శాతం పూర్తయిన తర్వాత సినిమాని ఎలా ఆపేస్తాం. ఎందుకు ఆపేస్తాం. కరోనా లాక్‌డౌన్ పూర్తయ్యి.. షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చిన వెంటనే మిగతా పార్ట్ షూటింగ్ చేస్తాం.. అని లైకా ప్రొడక్షన్స్ వివరణ ఇచ్చింది.

Advertisement
Advertisement
Advertisement