ప్రభుత్యోద్యోగులకు త్వరలో శుభవార్త..!

ABN , First Publish Date - 2022-05-11T01:06:03+05:30 IST

ప్రభుత్వోద్యోగులకు త్వరలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త అందనుంది. జులై, లేదా... ఆగస్టులో డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)లో మరో పెంపును కేంద్రం ప్రకటించవచ్చని వినవస్తోంది.

ప్రభుత్యోద్యోగులకు త్వరలో శుభవార్త..!

న్యూఢిల్లీ : ప్రభుత్వోద్యోగులకు త్వరలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్త అందనుంది. జులై, లేదా... ఆగస్టులో డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)లో మరో పెంపును కేంద్రం ప్రకటించవచ్చని వినవస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా ప్రతీ ఏటా జనవరి, జూలైలల్లో DA మరియు DR సంవత్సరానికి రెండుసార్లు సవరణలు జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం ఈ వారంలో విడుదల కానుంది.


ఫిబ్రవరిలో 6.1 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం మార్చిలో ఏడు శాతానికి పెరిగింది. ఇది ప్రధానంగా ఆహార పదార్థాల పెరుగుదల కారణంగా పెరిగింది. ఈ నెలలో ఆహార పదార్ధాలకు సంబంధించి ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.85 శాతంతో పోలిస్తే 7.68 శాతంగా ఉంది. జులైలో డియర్‌నెస్ అలవెన్స్‌ను మరో నాలుగు శాతం పెంచే అవకాశం ఉందని, ఈ క్రమంలో... డీఏ 38 శాతానికి చేరుతుందని పేర్కొంది. మార్చిలో, కేంద్ర మంత్రివర్గం 7వ వేతన సంఘం కింద డిఏలో 3 శాతం పెంచడానికి ఆమోదించింది, ఈ చర్య ద్వారా 50 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు. జనవరి 1, 2022, ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి బేసిక్ పే/పెన్షన్‌లో ప్రస్తుతమున్న 31 శాతం రేటు కంటే 3 శాతం పెరుగుదలను సూచిసున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Read more