Passport కోసం అప్లై చేసే వారికి గుడ్‌న్యూస్.. RPO కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-07-25T19:41:38+05:30 IST

రీజనల్ పాస్‌పోర్టు ఆఫీస్ (RPO) కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి నగరంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో(PSK) అదనపు పాస్‌పోర్ట్

Passport కోసం అప్లై చేసే వారికి గుడ్‌న్యూస్.. RPO కీలక ప్రకటన

Passport : రీజనల్ పాస్‌పోర్టు ఆఫీస్ (RPO) కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి హైదరాబాద్  నగరంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో(PSK) అదనపు పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్(Passoport Appointment) స్లాట్‌లను విడుదల చేయాలని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నిర్ణయించింది. ముఖ్యంగా లాక్‌డౌన్ తర్వాత పాస్‌పోర్ట్‌లకు డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం, రోజుకు 3000 ఆన్‌లైన్ స్లాట్లు ఉన్నాయి. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కింది పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ప్రతిరోజూ 150 అదనపు స్లాట్‌లను విడుదల చేయాలని నిర్ణయించారు.


ఇవీ కేంద్రాలు

1. బేగంపేట పీఎస్‌కే(PSK at Begumpet)

2. అమీర్‌పేట పీఎస్‌కే(PSK at Ameerpet)

3. టోలిచౌకి పీఎస్‌కే(PSK at Tolichowki)

4. నిజామాబాద్‌ పీఎస్‌కే(PSK at Nizamabad)

5. కరీంనగర్‌ పీఎస్‌కే(PSK at Karimnagar)


పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్‌ల (PCC) కోసం దరఖాస్తుల సంఖ్య పెరగడంతో.. RPO హైదరాబాద్ ఎలక్ట్రానిక్ సంతకం వ్యవస్థను ప్రారంభించింది. దీని ఫలితంగా సర్టిఫికెట్ గంటల్లో విడుదలవుతుంది. తమ ఫిర్యాదులను పరిష్కరించాలనుకునే దరఖాస్తుదారులు ‘Chat with your RPO’ service’ ద్వారా ఆర్పీఓతో మాట్లాడవచ్చు. అలాగే దరఖాస్తుదారులు మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య 8121401532 నంబర్‌కు వీడియో కాల్ చేసి తమ సందేహాలకు సమాధానాలను పొందవచ్చు.


ఇక తాజా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు లేదా గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించుకోవాలనుకునే వారు పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


హైదరాబాద్‌లోని పీఎస్‌కేలో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి స్టెప్స్‌..


1. పాస్‌పోర్ట్ సేవా అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.


2. కొత్త వినియోగదారులు రిజిస్టర్ చేసుకోవాలి. అయితే ఇప్పటికే ఉన్న వినియోగదారులు పోర్టల్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.


3. లాగిన్ అయిన తర్వాత, 'తాజా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు/పాస్‌పోర్ట్ రీ-ఇష్యూ' లింక్‌పై క్లిక్ చేయండి.


4. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో ఫారమ్‌ను పూరించవచ్చు లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో నింపి ఆపై అప్‌లోడ్ చేయవచ్చు.


5. ఫామ్‌ను ఫిల్ చేసిన తర్వాత, దరఖాస్తుదారులు వివిధ వర్గాల పాస్‌పోర్ట్‌లకు మారుతూ ఉండే విధంగా పే చేయాలి.


6. చెల్లింపు పూర్తయిన తర్వాత, దరఖాస్తుదారులు పీఎస్‌కేలలో పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు.


7. చివరగా.. పోలీసు ధృవీకరణ తర్వాత, పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫామ్‌లో పేర్కొన్న చిరునామాకు పోస్ట్ చేస్తారు.


పాస్‌పోర్ట్ కోసం ఎంత చెల్లించాలి?


పాస్‌పోర్ట్ కోసం ఎంత డబ్బు చెల్లించాలనేది వివిధ షరతులపై ఆధారపడి ఉంటుంది.


1. దరఖాస్తుదారుడి వయస్సు 15 సంవత్సరాల కంటే తక్కువ, సాధారణ పథకం కింద తాజా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే, దరఖాస్తు ఫీజు రూ. 1000. తత్కాల్ స్కీమ్(tatkal scheme) కింద ఫీజు రూ. 3000


2. దరఖాస్తుదారుడి వయస్సు 15-18 సంవత్సరాల మధ్య ఉంటే.. సాధారణ పథకం కింద 5 సంవత్సరాల చెల్లుబాటుతో లేదా 18 సంవత్సరాల వయస్సు వరకూ తాజా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే, దరఖాస్తు ఫీజు రూ. 1000. అదే తత్కాల్ అయితే రుసుము రూ. 3000. అలాగే దరఖాస్తుదారుడు 10 సంవత్సరాల చెల్లుబాటుతో పాస్‌పోర్ట్‌ను కోరితే, ఫీజు రూ.1500. తత్కాల్ కింద అయితే రూ. 3500.


3. దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ, సాధారణ పథకం కింద తాజా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే, దరఖాస్తు ఫీజు రూ. 1500. తత్కాల్ కింద ఫీజు రూ.3500.


4. పాస్‌పోర్ట్‌ను మళ్లీ జారీ చేసినట్లయితే ఫీజు సాధారణ పథకం కింద రూ. 1500. అయితే, మళ్లీ జారీ చేయడానికి కారణం ‘పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న పాస్‌పోర్ట్’ అయితే, దాని గడువు ముగియకపోతే ఫీజు రూ. 3000.

Updated Date - 2022-07-25T19:41:38+05:30 IST