- మరో రెండు గంటలు పొడిగింపు
హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : ట్యాంక్‌బండ్‌పై ఆదివారం పిక్నిక్‌కు నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో మధ్యాహ్నం 3 నుంచి (ఇప్పటి వరకు సాయంత్రం ఐదు నుంచి) రాత్రి పది వరకు ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ర్టిక్ గవర్నర్ విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో కిలోమీటరు పొడవు ఉన్న జాతీయ పతాకంతో నిర్వహించిన ప్రదర్శన ఈ సారి అందరినీ ఆకర్షించింది. 250 మందికి పైగా పాల్గొని జెండాను చేతబూని వందేమాతరం, భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.