Abn logo
Jul 8 2020 @ 13:03PM

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్20వ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు చిత్రబృందం శుభావార్త చెప్పింది. ఈ నెల పదో తేదీన ప్రభాస్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనుంది. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. 


`సాహో` తర్వాత `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు `రాధేశ్యామ్` అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి. మరి, టైటిల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే. 




Advertisement
Advertisement
Advertisement