మద్యం ప్రియులకు శుభవార్త..10 నిమిషాల్లోనే liquor డెలివరీకి స్టార్టప్

ABN , First Publish Date - 2022-06-02T16:38:39+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ 10 నిమిషాల్లో మద్యం డెలివరీ చేసే సేవలను కోల్‌కతాలో ప్రారంభించింది...

మద్యం ప్రియులకు శుభవార్త..10 నిమిషాల్లోనే liquor డెలివరీకి స్టార్టప్

కోల్‌కతా: హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ 10 నిమిషాల్లో మద్యం డెలివరీ చేసే సేవలను కోల్‌కతాలో ప్రారంభించింది.కోల్‌కతా నగరంలో ఆర్డర్ చేసిన 10నిమిషాల్లోనే మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా హైదరాబాద్ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి లభించింది.ఆన్‌లైన్ లిక్కర్ డెలివరీని ఇప్పటికే అనేక కంపెనీలు అందిస్తున్నాయి, కాని ఇప్పటివరకు ఎవరికీ 10 నిమిషాల వ్యవధిలోనే లిక్కర్ డోర్ డెలివరీ చేయడం లేదు.అత్యాధునిక సాంకేతికతతో మద్యాన్ని అత్యంత వేగంగా డోర్ డెలివరీ చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు బలిజేపల్లి వివేకానంద చెప్పారు. 


Updated Date - 2022-06-02T16:38:39+05:30 IST