గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రయాణికులకు శుభవార్త..!

ABN , First Publish Date - 2020-05-23T12:39:25+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రయాణికులకు శుభవార్త..!

గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రయాణికులకు శుభవార్త..!

జూన్‌ 1 తర్వాత మెట్రో రైలు పరుగులు 

కరోనా నివారణ మార్గదర్శకాలు తప్పనిసరి

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రయాణికులకు శుభవార్త..! కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన హైదరాబాద్‌ మెట్రోరైలు సేవలు జూన్‌ 1 తర్వాత పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనతా కర్ఫ్యూ (మార్చి 22) నాటి నుంచే హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపారాలు తిరిగి తెరుచుకున్నా.. హైదరాబాద్‌ మినహా ఇతర జిల్లాల్లో ఆర్టీసీ సేవలు ప్రారంభం కాకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ సగటున 4 లక్షల మందికి సేవలు అందిస్తున్న మెట్రో రైళ్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. అయితే.. కరోనా నివారణ, లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో, రైళ్లలో కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటారు. మాస్కులను ధరించడం, భౌతికదూరం, శానిటైజర్లను అందుబాటులో పెట్టడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. మెట్రో పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-05-23T12:39:25+05:30 IST