Abn logo
Apr 23 2021 @ 23:49PM

ఉపాధి వేతనదారులకు శుభవార్త
 రోజువారి వేతనం రూ.8 పెంపు

 3 లక్షల 34 వేల 733 మందికి లబ్ధి

(టెక్కలి)

ఉపాధి వేతనదారులకు శుభవార్త. రోజువారి వేతనం రూ.237 నుంచి రూ.245కు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది జీవో జారీచేశారు. జిల్లాలో 1,171 పంచాయతీల పరిధిలో ఉపాధి పనులు జరుగుతున్నాయి.  3 లక్షల 34 వేల 733 మంది వేతనదారులు పనులకు హాజరవుతున్నారు.  19 గ్రామ పంచాయతీల్లో మాత్రం వివిధ కారణాల వల్ల  పనులు జరగడం లేదు.   అత్యధికంగా రణస్థలం మండలంలో 17,553 మంది, సంతబొమ్మాళిలో 17,118 మంది, సీతంపేటలో 12,418మంది వేతనదారులు పనులకు హాజరవుతున్నారు.   అత్యల్పంగా పలాస మండలంలో 4,263మంది, వజ్రపుకొత్తూరు 4376 మంది, హిరమండలం 4341మంది పనుల్లో పాల్గొంటున్నారు.. రణస్థలం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, వంగర మండలాల్లో 112శాతం కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు.  గత ఏడాది 1096 పంచాయతీల్లో 43,752 శ్రమశక్తి సంఘాలకు గాను సుమారు 4లక్షల99వేల మంది వేతనదారులు పనులకు హాజరయ్యారు.  ఉపాధి వేతనదారులకుు వేతనం పెంపు నిర్ణయంపై ఏపీవో బగాది ప్రసాద్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా రోజుకి ఎనిమిది రూపాయలు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. మేలో పనిచేసే వారికి వేసవి అలవెన్స్‌ కింద రూ.30 కలిసే అవకాశం ఉందని తెలిపారు.
Advertisement