ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్!

ABN , First Publish Date - 2020-03-26T21:13:35+05:30 IST

రాజధాని ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ శుభవార్త చెప్పారు

ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్!

న్యూఢిల్లీ: రాజధాని ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ శుభవార్త చెప్పారు. నగరంలో నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు 24 గంటలు తెరిచి ఉంచేలా అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో వీరిద్దరూ మాట్లాడుతూ.. సామాజిక దూరాన్ని ప్రోత్సహించి, షాపుల్లో రద్దీని తగ్గించే ఉద్దేశంతో నిత్యావసర సరుకుల దుకాణాలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నిత్యావసర వస్తువులు ఉత్పత్తి చేసే కంపెనీలకు కూడా 24 గంటలూ పనిచేసుకునేలా అవకాశం కల్పిస్తున్నామని, అయితే అది తప్పనిసరేం కాదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ-కామర్స్ సంస్థల విషయంలో ఎవరికీ ఆటంకం కలిగించొద్దని, డెలివరీ బాయ్‌లను అడ్డుకోవద్దని పోలీసులను కోరారు.  


ఢిల్లీలో లాక్‌డౌన్‌ను చాలా సమర్థంగా అమలు చేస్తున్నట్టు గవర్నర్ అనిల్ బైజాల్ తెలిపారు. డెలివరీలకు ఈ-కామర్స్ సంస్థల సదుపాయాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వారికి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరినట్టు చెప్పారు. క్యూలు తగ్గించేందుకు నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు రోజంతా తెరిచి ఉంచుకునేలా అనుమతి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, అది తప్పనిసరేం కాదని, కాకపోతే అనుమతి ఇస్తున్నామని గవర్నర్ వివరించారు.  ఢిల్లీలో 36 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. వీరిలో 26 మంది విదేశాల నుంచి వచ్చినవారే. మిగతా వారికి వీరి నుంచి సోకింది.  

Updated Date - 2020-03-26T21:13:35+05:30 IST