Good News : రూ.10తోనే Police కేసును క్లోజ్‌ చేసుకోవచ్చు.. ఆలస్యమెందుకు త్వరపడండి..

ABN , First Publish Date - 2022-05-03T14:04:55+05:30 IST

రూ.10తోనే Police కేసును క్లోజ్‌ చేసుకోవచ్చు.. ఆలస్యమెందుకు త్వరపడండి..

Good News : రూ.10తోనే Police కేసును క్లోజ్‌ చేసుకోవచ్చు.. ఆలస్యమెందుకు త్వరపడండి..

  • లాక్‌ డౌన్‌ సమయంలో నమోదైన కేసులకు సదావకాశం


హైదరాబాద్ సిటీ/బోయినపల్లి : కరోనా లాక్‌డౌన్‌సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వారిపై నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం, కోర్టులు ఊరట కల్పించాయి. రెండు లాక్‌డౌన్లలో నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన ప్రజలపై పోలీసులు కేసులు నమోదు చేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ఆయా కేసులను క్లోజ్‌ చేసుకోవడానికి ప్రభుత్వం, కోర్టులు ఓ మంచి అవకాశాన్ని కల్పించాయి.


ఏ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో కేసులు నమోదయ్యాయో సదరు పోలీ‌స్‌స్టేషన్‌లో ఆధార్‌ కార్డును సమర్పించి వెయ్యి రూపాయల జరిమానాకు బదులు కేవలం పది రూపాయలు మాత్రమే కట్టి తమ కేసును క్లోజ్‌ చేసుకోవచ్చని బోయినపల్లి సీఐ రవికుమార్‌ తెలిపారు. కోర్టుకు వెళ్లకుండానే కేవలం స్థానిక పోలీ‌స్‌స్టేషన్లలోనే కేసును కొట్టేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మే 2నుంచి 8వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉందన్నారు. గడువు ముగిసిన తర్వాత జరిమానాలు చెల్లించే వారుంటే వారికి పాతపద్ధతిలోనే వెయ్యిరూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.



Read more