అసెంబ్లీ వేదికగా పోలీసులపై సీఎం స్టాలిన్ వరాల జల్లు

ABN , First Publish Date - 2021-09-14T18:09:35+05:30 IST

ఎంకే స్టాలిన్‌ శాసనసభలో పోలీసులపై వరాల జల్లులు కురిపించారు...

అసెంబ్లీ వేదికగా పోలీసులపై సీఎం స్టాలిన్ వరాల జల్లు

  • త్వరలో సంక్షేమ బోర్డు ఏర్పాటు
  • బస్సుల్లో ఉచిత ప్రయాణం
  • రిస్క్‌ అలవెన్స్‌ రూ.1000కి పెంపు
  • 1132 మంది వారసులకు ఉద్యోగాలు
  • థౌజండ్‌లైట్స్‌లో రూ.275 కోట్లతో క్వార్టర్స్‌

చెన్నై : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శాసనసభలో పోలీసులపై వరాల జల్లులు కురిపించారు. పోలీసులకు కొత్త పథకాలను అమలు చేయడానికి, సమర్థవంతమైన శిక్షణ అందించడానికి వీలుగా త్వరలో పోలీసుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ప్రక టించారు. శాసనసభలో సోమవారం ఉదయం పోలీసుశాఖకు సంబంధిం చిన ఆర్థిక పద్దులపై ఆయన ప్రసంగిస్తూ ఆ శాఖకు సంబంధించి అరవై ప్రకటనలు చేశారు. ముఖ్యంగా పోలీసులకు అంది స్తున్న రిస్క్‌ అలవెన్స్‌ను రూ.800 నుంచి రూ.1000లకు పెంచుతున్నామన్నారు. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న 1132 మంది పోలీసు వారసులను కారుణ్య ప్రాతిపదికన వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లో నియ మించనున్నామని పేర్కొన్నారు. పోలీసులు తాము పని చేస్తున్న జిల్లా అంతటా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించనున్నామని, ఆ మేరకు ప్రత్యేక గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు.


కానిస్టేబుళ్ళు, హెడ్‌కానిస్టేబుళ్లు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనువుగా వారం లో ఒక రోజు సెలవు మంజూరు చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం పోలీసులకు ఏటా ఉచితంగా సమగ్రమైన వైద్యపరీక్షలు చేయించుకు నేందుకు అనుమతిస్తున్నామని, ఇకపై వారి భార్యలకు కూడా వైద్యపరీక్షలు చేసుకునే సదుపాయం కల్పిస్తామని చెప్పారు. పోలీసుల సమస్యలను పరిష్కరించేందుకు రూ.25లక్షలతో ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నట్టు తెలిపారు. చెన్నై థౌజండ్‌లైట్స్‌ ప్రాంతంలో రూ.275 కోట్లతో పోలీసు క్వార్టర్స్‌ను నిర్మించనున్నామని, ఆవడి, తాంబరం కార్పొరేషన్లలో కొత్త పోలీసు కమిషనర్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నామని సీఎం ప్రకటించారు. పోలీసు క్యాంటీన్లలో విక్రయిస్తున్న వస్తువులపై జీఎస్టీని మిన హాయించేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసుల పదోన్నతికి కాలపరిమితిని నిర్ణయించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, మెరీనాబీచ్‌లో ప్రత్యేక ప్రాణ రక్షక దళం ఏర్పాటు చేస్తామని, రాష్ట్రంలో కొత్తగా పది పోలీసులస్టేషన్లను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.


అన్నాజయంతికి 700 మంది ఖైదీల విడుదల

డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి రోజైన ఈనెల 15వ తేదీనయావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న 700 మంది  ఖైదీలను విడుదల చేయనున్నట్టు స్టాలిన్‌ ప్రకటించారు. మాజీ ముఖ్య మంత్రి జయలలిత మృతి కేసులో వాస్తవాలను కనుగొనేందుకు తమ ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపడు తుందని, జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ విచారణ పూర్తయి న తర్వాత ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించి వాస్తవాలను బయటపెడతామని ప్రకటించారు. ఇదిలా వుండగా తమ శాఖపై వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలుసుకున్న చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-09-14T18:09:35+05:30 IST