గుడ్‌న్యూస్: 1284 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2021-12-12T17:28:42+05:30 IST

ఉద్యోగాల భర్తీ..

గుడ్‌న్యూస్: 1284 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

జాతీయ బ్యాంకుల్లో కొలువులు

భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంటోంది. దేశంలోనే అతి పెద్దదైన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్‌బీఐ) 1226 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లతో ప్రకటనను విడుదల చేసింది. అదేవిధంగా 52 ఖాళీలతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, 6 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడి విడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. అయితే వీటిలో కొన్ని పోస్టులు రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉండగా, కొన్ని బ్యాక్‌లాగ్‌ ఖాళీలు. మరికొన్నింటిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.



బీఓబీలో 52 స్పెషలిస్ట్‌ ఐటీ ఆఫీసర్లు

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా... ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ ఐటీ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


క్వాలిటీ అస్యూరెన్స్‌ లీడ్‌: 02 

క్వాలిటీ అస్యూరెన్స్‌ ఇంజనీర్లు: 12

డెవలపర్‌(ఫుల్‌ స్టాక్‌ జావా, మొబైల్‌ అప్లికేషన్‌ డెవల్‌పమెంట్‌): 24

యూఐ/యూఎక్స్‌ డిజైనర్‌: 02

క్లౌడ్‌ ఇంజనీర్‌: 02 

అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌: 02

ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్‌: 02

టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌: 02 

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆర్కిటెక్ట్‌: 02

ఇంటిగ్రేషన్‌ ఎక్స్‌పర్ట్‌: 02


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

వయసు: పోస్టుల్ని అనుసరించి 23 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. 

పరీక్ష: ఈ పరీక్షను మొత్తం 225 మార్కులకు నిర్వహిస్తారు. నాలుగు సెక్షన్ల నుంచి మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్‌ - 25 ప్రశ్నలు- 25 మార్కులు; ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ - 25 ప్రశ్నలు- 25 మార్కులు; క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ - 25 ప్రశ్నలు- 25 మార్కులు; ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌- 75 ప్రశ్నలు- 150 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.  పరీక్ష వ్యవధి 150 నిమిషాలు. ప్రశ్న పత్రం ఇంగ్లీష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. 


దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

చివరి తేదీ: డిసెంబరు 28

వెబ్‌సైట్‌: www. bankofbaroda.in/


యూబీఐలో ఎగ్జిక్యూటివ్‌లు

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ)... కాంట్రాక్ట్‌ పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 6

చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌, చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌, హెడ్‌ - అనలిటిక్స్‌, చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌, హెడ్‌ - ఏపీఐ మేనేజ్‌మెంట్‌, హెడ్‌ - డిజిటల్‌ లెండింగ్‌ అండ్‌ ఫిన్‌టెక్‌

 

అర్హత: గ్రాడ్యుయేషన్‌ బీఈ/బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సర్టిఫికెట్‌ కోర్సులు చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్‌ స్కిల్స్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: రూ.1000 చెల్లించాలి.

చివరి తేదీ: డిసెంబరు 29

వెబ్‌సైట్‌: https://www.unionbankofindia.co.in/


ఎస్‌బీఐలో 1226 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు

ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం వివిధ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 1226(రెగ్యులర్‌-1100, బ్యాక్‌లాగ్‌-126)

అర్హత: ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత

వయసు: 2021 డిసెంబరు 01 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే..అభ్యర్థులు 2000 డిసెంబరు 01 నుంచి 1991 డిసెంబరు 02 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌), స్ర్కీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష: రాత పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ 120 మార్కులకు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌కి నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. 

ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ - 30 ప్రశ్నలు- 30 మార్కులు- 30 నిమిషాలు

- బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌ - 40 ప్రశ్నలు- 40 మార్కులు- 40 నిమిషాలు

- జనరల్‌ అవేర్‌నె్‌స/ఎకానమీ - 30 ప్రశ్నలు- 30 మార్కులు- 30 నిమిషాలు

- కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ - 20 ప్రశ్నలు- 20 మార్కులు - 20 నిమిషాలు

డిస్ట్ర్కిప్టివ్‌ టెస్ట్‌ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌(లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌) నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 

ఫీజు: ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

చివరి తేదీ: డిసెంబరు 29

ఆన్‌లైన్‌ టెస్ట్‌: 2022 జనవరి

వెబ్‌సైట్‌: sbi.co.in/




Updated Date - 2021-12-12T17:28:42+05:30 IST