విష్ణు కుటుంబానికి అండగా ఉంటా..

ABN , First Publish Date - 2022-05-20T06:53:41+05:30 IST

కోడుమూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి కుటుంబానికి అండగా వుంటానని మా జీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

విష్ణు కుటుంబానికి అండగా ఉంటా..

విజయవాడకు రావాలని విష్ణువర్దన్‌రెడ్డి కి చంద్రబాబు పిలుపు


కర్నూలు(రూరల్‌) మే19: కోడుమూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి కుటుంబానికి అండగా వుంటానని మా జీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డి తనయుడు, కర్నూలు మాజీ ఎంపీపీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాజవర్థన్‌రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కర్నూలు పర్యటనకు వచ్చిన చంద్రబాబు గురువారం ఉదయం 11.30 గంటలకు కర్నూలు నెహ్రునగర్‌లో వున్న విష్ణు ఇంటికి చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబును చూసి న విష్ణు భార్య సుజాతమ్మ బోరున విలపించారు. రాజవర్ధన్‌ రెడ్డి సతీమణి సౌజన్యరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. వారిని  చంద్రబాబు ఓదార్చారు. విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా సహకరిస్తానని చంద్రబాబు భరోసా నిచ్చారు. టీడీపీ  మహానాడు పూర్తయ్యాక విజయవాడకు రావాలని విష్ణువర్ధరెడ్డికి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సందర్భంగా కోడుమూరు నియోజకవర్గ పరిధిలో తాను గెలిపించిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను చంద్రబాబుకు విష్ణు పరిచయం చేశారు. అ క్కడ విష్ణుకు చంద్రబాబు ఎలాంటి బాధ్యతలు అప్పగించేదీ స్పష్టత వచ్చే అవకాశం వుం ది.  కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో విష్ణు ఇంటికి ఆయన వర్గీయులు, అభిమానులు తరలివచ్చారు. చంద్రబాబు వెంట టీడీపీ కర్నూలు పార్లమెం టు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, కడప అమర్‌నాథ్‌రెడ్డి, విష్ణు వియ్యంకుడు నరసింహారెడ్డి, అల్లు డు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వున్నారు. 

Updated Date - 2022-05-20T06:53:41+05:30 IST