Oct 20 2021 @ 10:45AM

నవంబర్ 19న 'గుడ్ లక్ సఖి' రిలీజ్..?

క్రేజీ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'గుడ్ లక్ సఖి'. ఈ మూవీని నవంబర్ 19న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. జాతీయ అవార్డ్ గ్రహీత నగేష్ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలకపాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పాడిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల కీర్తి సురేశ్ బర్త్ డే సందర్భంగా, ఈ మధ్య ఎలాంటి అప్‌డేట్స్ లేనటువంటి 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని నవంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే నవంబర్ 19న రిలీజ్ చేసే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుంది. ఇక కీర్తి ప్రస్తుతం, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట', మెగాస్టార్ నటించబోతున్న 'భోళా శంకర్', సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'అణ్ణాత్త', నేచురల్ స్టార్ నానీ తాజాగా ప్రకటించిన 'దసరా' చిత్రాలు చేస్తోంది.