Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 21 Jan 2022 16:25:45 IST

‘గుడ్‌లక్ సఖి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

twitter-iconwatsapp-iconfb-icon
గుడ్‌లక్ సఖి రిలీజ్ డేట్ వచ్చేసింది

‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘గుడ్‌లక్ సఖి’. క్రీడా నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఎక్కువ మంది మ‌హిళా టెక్నీషియన్స్‌తో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని చిత్రయూనిట్ ప్రకటించింది.  జనవరి 28న  ‘గుడ్‌లక్ సఖి’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మరింతగా ప్రమోట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ప్రమోషన్స్‌ ను వేగవంతం చేశారు. 


నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన`గుడ్ లక్ సఖి` సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, చిరంతన్ దాస్ ఛాయగ్రహణం సమకూర్చారు.  ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పోస్టర్లు విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. మరి ‘గుడ్‌లక్ సఖి’ గా కీర్తి సురేశ్ ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement