'గుడ్ లక్ సఖి' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవనున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు నగేష్ కుకునూరు దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. నేడు (జనవరి 24) పార్క్ హయత్‌లో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరవనున్నారు. వాస్తవంగా మెగాస్టార్ ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సి ఉంది. అయితే, ఆయన కరోనా బారిన పడిన నేపథ్యంలో ఆ స్థానంలో చిరుకు బదులు ఆయన తనయుడు చరణ్ విచ్చేయనున్నారు.