`మహనటి` కీర్తి సురేష్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తను నటించిన స్పోర్ట్స్ డ్రామా `గుడ్‌లక్ సఖి`ని విడుదల చేయబోతోంది. జూన్ 3వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం తాజాగా ఓ ప్రకటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు నాగేష్ కుకునూర్ ఈ సినిమాను తెరకెక్కించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. సుధీర్ చంద్ర, శ్రావ్య వర్మ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.