Jun 6 2021 @ 16:10PM

ఓటీటీలో 'గుడ్ లక్ సఖి'..?

కీర్తి సురేష్ నటించిన 'గుడ్ లక్ సఖి' ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' డిజిటల్ రిలీజయిన సంగతి తెలిసిందే. కానీ ఈ రెండు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ ఏడాది థియేటర్స్‌లో రిలీజైన 'రంగ్ దే' ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో 'గుడ్ లక్ సఖి' చిత్రాన్నిరిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. నగేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉండగా థియేటర్స్ మూతపడటంతో పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. అయితే థియేటర్స్ ఓపెన్ అయినా జనాలు థియేటర్స్ వరకు వస్తారా అనే సందేహంతో ఇంకా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా ఉండటం కరెక్ట్ కాదని జీ5 ఓటీటీ ద్వారా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారట. అయితే మేకర్స్ నుంచి 'గుడ్ లక్ సఖి' విడుదల విషయంలో క్లారిటీ రాలేదు. కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట', రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే'లో కీలక పాత్ర పోషిస్తోంది.