ఏపీసీవోఎస్‌తో నిరుద్యోగులకు మేలు

ABN , First Publish Date - 2020-07-04T11:20:32+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌(ఏపీసీవోఎస్‌)తో నిరుద్యోగులకు ఎంతో మేలు జరగనుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

ఏపీసీవోఎస్‌తో నిరుద్యోగులకు మేలు

వీడియో కాన్ఫరన్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌ 


కలెక్టరేట్‌: ఆంధ్రప్రదేశ్‌ ఔట్‌ సోర్సింగ్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌(ఏపీసీవోఎస్‌)తో  నిరుద్యోగులకు ఎంతో మేలు జరగనుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఈ కార్పొరేషన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, లంచాలకు తావులే కుండా, కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ నియామకాలు ఈ కార్పోరేషన్‌ ద్వారా జరుగుతాయన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ నియామకాల్లో మహిళలకు 50 శాతం ఉద్యోగాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉంటాయన్నారు.


దీనికోసం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీ పని చేస్తుందని తెలిపారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3,855 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారని, ఈ కార్పొరేషన్‌తో వారికి ప్రయోజనం కలగనుందని చెప్పారు.  కార్యక్ర మంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, జేసీ సుమిత్‌ కుమార్‌, వైసీపీ నాయకురాలు,  కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, సీపీవో  మోహనరావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి  జి.శ్రీని వాసరావు, వైసీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-04T11:20:32+05:30 IST