వయసు పెరిగిన వారిలో ఎముకలు దృడంగా ఉండాలంటే..

ABN , First Publish Date - 2020-05-24T18:05:26+05:30 IST

మా నాన్నగారికి అరవై ఏళ్లు. ఆయన ఎముకలు దృఢంగా ఉండాలంటే ఏ ఆహారం మంచిది?

వయసు పెరిగిన వారిలో ఎముకలు దృడంగా ఉండాలంటే..

ఆంధ్రజ్యోతి(24-05-2020)

ప్రశ్న: మా నాన్నగారికి అరవై ఏళ్లు. ఆయన ఎముకలు దృఢంగా ఉండాలంటే ఏ ఆహారం మంచిది?

- శ్రీకృష్ణ, వరంగల్‌


డాక్టర్ సమాధానం: వయసు పెరుగుతున్నకొద్దీ కండరాల్లో పటుత్వం తగ్గినట్టే, ఎముకలూ పెళుసుబారతాయి. ఎముకల ఆరోగ్యానికి, దృఢత్వానికి ముఖ్యంగా కాల్షియం, విటమిన్‌- డి చాలా అవసరం. ఈ రెంటితో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, విటమిన్‌- కె ఎముకల నిర్మాణానికి, ఎముకలు పెళుసుబారకుండా ఉండడానికి అత్యవసరం. పాలు, పెరుగు ముఖ్యమైన కాల్షియాన్ని, ఫాస్ఫరస్‌ను అందిస్తాయి. కొన్ని రకాల ఆకుకూరల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. పప్పు ధాన్యాల నుంచి; పాలు, పాల ఉత్పత్తుల నుంచీ మాంసకృత్తులు లభిస్తాయి. విటమిన్‌ - డి కి మూలం సూర్యరశ్మి. అలాగే ఫోర్టిఫై చేసిన పాల వల్ల కాల్షియం, విటమిన్‌ - డి రెండూ లభిస్తాయి. ఇలా సమతుల ఆహారం తీసుకుంటే ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో ఉప్పు, కూల్‌ డ్రింక్స్‌, మాంసాహారం, కాఫీ తీసుకోవడం; ధూమపానం చేయడం; శారీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల ఎముకలు పెళుసు బారే అవకాశం ఉంది.  అలవాటు లేకపోయినా ఇప్పుడైనా తేలిక పాటి వ్యాయామాలు మొదలుపెడితే ఎముకల దృఢత్వాన్ని కాపాడుకోవచ్చు.


డా. లహరి సూరపనేని న్యూట్రిషనిస్ట్,

వెల్‌నెస్ కన్సల్టెంట్ nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-05-24T18:05:26+05:30 IST