సంతలో అడ్డాకులకు భలే డిమాండ్‌

ABN , First Publish Date - 2022-05-29T06:15:43+05:30 IST

మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో అడ్డాకులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది.

సంతలో అడ్డాకులకు భలే డిమాండ్‌
హుకుంపేట సంతలో అడ్డాకుల క్రయవిక్రయాలు


కావిడ అడ్డాకులు రూ.2,500లకు విక్రయం

హుకుంపేట, మే 28: మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో అడ్డాకులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో 50 కిలోలుండే కావిడ అడ్డాకులను గిరిజన రైతుల నుంచి వర్తకులు రూ.2,500 చొప్పున కొనుగోలు చేశారు. ఇదే కావిడి అడ్డాకులను గత వారం రూ.2 వేలుకు కొనుగోలు చేయగా, ఈ వారం మరో రూ.500 ధర పెంచి కొనుగోలు చేశారు. దీంతో గిరిజన రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇదే ధర కొనసాగితే చాలని రైతులు అంటున్నారు.

Updated Date - 2022-05-29T06:15:43+05:30 IST