కంటెంట్‌ ఉన్న చిత్రాలు విజయం సాధిస్తాయి!

  • విష్ణు మంచు

‘‘కంటెంట్‌ ఉన్న చిత్రాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అదే కోవలో ‘నీకు నాకు పెళ్ళంట’ విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్‌ చూశా. చాలా బావుంది’’ అని విష్ణు మంచు అన్నారు. కార్తీక్‌ శివ, సంజనా అన్నే జంటగా నటించిన చిత్రం ‘నీకు నాకు పెళ్ళంట’. తాళ్లూరి మణికంఠ దర్శకత్వంలో కాసు శ్రీనివాస్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విష్ణు మంచు విడుదల చేశారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖయ్యూమ్‌, వాసు ఇంటూరి, శ్రీసుధ, ప్రియ పాలువై తదితరులు నటించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీత దర్శకుడు.


Advertisement