Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

శరీరంలో మంచి-చెడు పిండి పదార్థాలు లోపిస్తే..?

twitter-iconwatsapp-iconfb-icon
శరీరంలో మంచి-చెడు పిండి పదార్థాలు లోపిస్తే..?

ఆంధ్రజ్యోతి(03-05-2022)

పిండి పదార్థాలు శక్తి భాండాగారాలు. వీటిని పూర్తిగా మానేయడం సరైన పని కాదు. అయితే శరీర బరువును అదుపులో ఉంచుకోవడం కోసం మంచి పిండిపదార్థాలను ఎంచుకోవాలి. వేటిని తినడం మానేయాలో, వేటిని తినాలో తెలుసుకోవాలి. 


పిండిపదార్థాలు లోపిస్తే?

శక్తికి మూలాలైన పిండిపదార్థాలు లోపిస్తే నీరసం, నోటి దుర్వాసన, మలబద్ధకం, వాంతులు, తలనొప్పి మొదలైన లక్షణాలు మొదలవుతాయి. సరిపడా కార్బొహైడ్రేట్స్‌ తినడం లేదనే విషయాన్ని ఈ లక్షణాల ఆధారంగా గ్రహించాలి. 


మంచి పిండిపదార్థాలు (కాంప్లెక్స్‌ కార్బ్స్‌)

వీటిలోని రసాయన రూపం, పీచులను జీర్ణం చేసుకోవడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చుచేయవలసివస్తుంది. 

వీటి నుంచి అందే శక్తి శరీరానికి ఎక్కువ సమయంపాటు ఉపయోగపడుతుంది. 


మంచి పిండిపదార్థాలలో....

పోషకాలు, పీచు ఎక్కువ

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ

తక్కువ క్యాలరీలతోనే కడుపు నిండుతుంది

శరీరం శక్తిని ఖర్చు చేసుకునే వేగం (మెటబాలిజం) పెరుగుతుంది.

పొట్టు తీయని గోధుమలతో తయారైన బ్రెడ్‌, రొట్టెలు, తృణధాన్యాలు, ఆకుపచ్చని కూరగాయలు, చిలకడదుంపలు, తాజా పండ్లు ఈ కోవకు చెందినవి.


చెడు పిండిపదార్థాలు (సింపుల్‌ కార్బొహైడ్రేట్స్‌)

ఇవన్నీ పొట్టు తీసి, పాలిష్‌ చేసిన పదార్థాలు. వీటిలో సహజసిద్ధ పోషకాలు, పీచు తక్కువ. 


చెడు పిండిపదార్థాల్లో....

పీచు, పోషకాలు అతి స్వల్పం

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువ

క్యాలరీలు కొవ్వుగా మారతాయి

అత్యధిక గ్లూకోజ్‌ స్థాయులు (నీరసం తెప్పిస్తాయి)

చాక్లెట్లు, తీపి పదార్థాలు, తీపి జోడించిన తృణధాన్యాలు, సోడాలు, శీతల పానీయాలు, పొట్టు తీసిన పిండ్లు ఈ కోవకు చెందినవి.


మేలురకం పిండిపదార్థాలు... 

ఓట్స్‌తో తయారైన బిస్కెట్లు, నారింజ రసం, యాపిల్‌, కేరట్లు, టమేటాలు, ఎండుద్రాక్ష, ద్రాక్ష, అరటిపండ్లు. 


ఓట్‌మీల్‌: ఎక్కువ సమయంపాటు శక్తినిచ్చే నిలకడైన పిండిపదార్థం ఇది. నీళ్లు కలిపి తయారుచేసిన ఒక కప్పు ఓట్‌మీల్‌లో 159 క్యాలరీలు ఉంటాయి. 4 గ్రాములు పీచు, 6 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి.


యాపిల్‌: భోజనానికి, భోజనానికి మధ్య తీసుకోవలసిన ఈ అల్పాహార ఫలంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే 4 గ్రాముల పీచు, పెక్టిన్‌లు ఉంటాయి. మాంసకృత్తులు పుష్కలంగా ఉండే వేరుశెనగపప్పుతో తయారయ్యే వెన్నతో కలిపి తీసుకుంటే ప్రయోజనకరం. 


చిలకడదుంపలు: ఇది నిజమైన ‘సూపర్‌ ఫుడ్‌’. కప్పు చిలకడదుంప ముక్కల్లో 7 గ్రాముల పీచు, అత్యధిక విటమిన్‌ ఎ, సిలు, 4 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి.


మినుములు: ఒక కప్పు ఉడకబెట్టిన పొట్టు తీయని మినుముల్లో 15 గ్రాముల పీచు, అంతే పరిమాణంలో మాంసకృత్తులు ఉంటాయి. ఇంత పరిమాణంలో పోషకాలు మరే పదార్థంలోనూ ఉండవు. 


టమాటాలు: వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలం. పీచుతో పాటు లైకోపీన్‌ అనే యాంటీఆక్సిడెంటు కూడా వీటిలో ఉంటాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.