ఇంటి ఆవరణలో పూలు కోస్తుండగా.. ఓ వ్యక్తి అక్కడకు వచ్చి.. ఆమెను మాటల్లో పెట్టి..

ABN , First Publish Date - 2020-08-14T12:02:40+05:30 IST

పెదగంట్యాడ సమీపం గొంతినవానిపాలేనికి చెందిన గొంతిన..

ఇంటి ఆవరణలో పూలు కోస్తుండగా.. ఓ వ్యక్తి అక్కడకు వచ్చి.. ఆమెను మాటల్లో పెట్టి..

మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తెలతాడు అపరహరణ


పెదగంట్యాడ(విశాఖపట్నం): పెదగంట్యాడ సమీపం గొంతినవానిపాలేనికి చెందిన గొంతిన మంగ అనే మహిళ మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడును తెంచుకుని ఓ వ్యక్తి పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మంగ తన ఇంటి ఆవరణలో పూలు కోస్తుండగా 30 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వచ్చి ఆమెను మాటల్లో పెట్టాడు. అలా మాట్లాడుతుండగానే ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు న్యూపోర్టు క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-08-14T12:02:40+05:30 IST