ఆదిలాబాద్ : ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు డిమాండ్ చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 317 జీఓ అనేక మంది ఉపాధ్యాయులను ఆగం చేస్తోందన్నారు. టీచర్ సంఘాలతో, ప్రతిపక్ష నేతలతో చర్చించి 317 జీఓపై ఓ నిర్ణయం తీసుకోవాలని గోనె ప్రకాశరావు డిమాండ్ చేశారు.