టీఆర్‌ఎస్‌లో రాసలీలలు కొత్తేం కాదు : గోనె ప్రకాశరావు

ABN , First Publish Date - 2022-01-07T18:12:41+05:30 IST

టీఆర్‌ఎస్‌లో రాసలీలలు కొత్తేం కాదని... వనమా రాఘవే కాదు.. టీఆర్ఎస్‌లో చాలా మంది ఉన్నారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశరావు పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌లో రాసలీలలు కొత్తేం కాదు : గోనె ప్రకాశరావు

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో రాసలీలలు కొత్తేం కాదని... వనమా రాఘవే కాదు.. టీఆర్ఎస్‌లో చాలా మంది ఉన్నారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశరావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనపడని రాసలీలలు ఎన్నో ఉన్నాయన్నారు. ఎంతో మంది మీ పార్టీ లీడర్లు అమాయకులను వంచనకు గురి చేస్తున్నారన్నారు. త్వరలో అన్ని ఆధారాలూ బయట పెడతానన్నారు. ప్రజా ప్రతినిధుల అధికారిక గృహాల్లో ఏం నడుస్తుందో మీకు తెలుసా? అని గోనె ప్రకాశరావు ప్రశ్నించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘‘సీఎం గారు మీ పోలీస్‌లు మీకు ఏం చెప్పట్లేదా? గతంలో ఇలాంటి పరిస్థితులు లేవు. గన్ మెన్‌ల నుంచి ప్రతి సమాచారం డీజీపీకి అందేది. లీడర్లు ఎటు తిరుగుతున్నారు అని పక్కా సమాచారం ఉండేది. లీడర్ పక్క దారి పడితే వెంటనే అలెర్ట్ చేసే వ్యవస్థ ఉండేది. మీరు ఒక సారి నిఘా పెడితే ఎన్నో కేసులు బయటకు వస్తాయి. అధికార మదంతో మీ నాయకులు రాసలీలలు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఒక కాల్ సెంటర్ పెట్టి చూడండి... ఎన్ని రాసలీలలు మీ దృష్టికి వస్తాయో’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2022-01-07T18:12:41+05:30 IST