వావ్... నిద్రలో నడుస్తూ...

ABN , First Publish Date - 2020-02-03T21:41:26+05:30 IST

సోమ్నాంబులిజం... నిద్రలో నడిచే ఈ అలవాటు గురించి వినే ఉంటారు. మామూలుగానైతే... ఈ అలవాటున్న

వావ్... నిద్రలో నడుస్తూ...

మహబూబాబాద్ : సోమ్నాంబులిజం... నిద్రలో నడిచే ఈ అలవాటు గురించి వినే ఉంటారు. మామూలుగానైతే... ఈ అలవాటున్న వారు మంచం దిగి కొన్ని అడుగులు అటూ ఇటూ వేస్తారు. మహా అయితే కొన్ని మీటర్ల దూరం కానీ... ఏకంగా విద్యుత్తు స్తంభాన్నే ఎక్కేస్తే... నిజం మరి. అటువంటి సంఘటనే మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేవలం స్తంభాన్నెక్కడమే కాదు... అక్కడ విన్యాసాలు కూడా చేశాడు. అది చూసిన వాళ్లు వెంటనే కరెంటు సిబ్బందికి ఫోన్‌లో సమాచారాన్నందించారు. వెంటనే వాళ్ళతోపాటు పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి అతడిని కిందకు దింపారు. ఏంటి ? ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కావా ? అని అడిగితే... ‘ఛఛ... అదేం లేదు. నిద్రమత్తులో అలా చేశాను’ అని చెప్పాడు. దీంతో నివ్వెరపోవడం విద్యుత్తు శాఖ సిబ్బంది, పోలీసుల వంతైంది. 


దీంతో ‘జోకులెయ్యొద్దు’ అంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అతడు మళ్ళీ ‘లేదు సార్... జోక్ కాదు. నాకు తెలియకుండానే స్తంభమెక్కేశాను. నిద్రలోనే జరిగుంటుంది. తీరా చూస్తే... విద్యుత్తు స్తంభంపై ఉన్నా’నంటే బల్ల గుద్ది మరీ చెప్పాడు. 


అంటే... ‘జోక్ కాదు సార్... నిద్రపోయా... ఇప్పుడు చూస్తే... కరెంటు స్తంభంపై ఉన్నా’నన్నాడు. పోలీసులు, కరెంటు సిబ్బందీ మొహాలు చూసుకున్నారు. నందినగర్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. మొత్తంమీద నిద్రలో ఎలా నడిచి వెళ్ళాడో తెలియదు కానీ... బల్లిలా పాకుతూ స్తంభమెక్కుతుంటే ఓ కుర్రాడు చూశాడు. అయితే... విద్యుత్తు శాఖ సిబ్బంది ఎక్కుతున్నారేమోననుకున్నాడటు. అయితే... ఆ వెంటనే మళ్ళీ ఓ డౌటొచ్చింది. అతను విద్యుత్తు ఉద్యోగిలా లేడు. అతను అటూ ఇటూ ఊగుతూ స్తంభమెక్కుతుంటే... ఆ కుర్రాడికి ఎక్కడో తేడా కొట్టింది. ఎందుకైనా మంచిదనుకుని విద్యుత్తు శాఖ సిబ్బందికి ఉప్పందించాడు. 


ఆ కాలనీవాసులు కూడా ఈ విషయంపై వేగంగానే స్పందించారు. అతను స్తంభం ఎక్కుతున్నప్పుడే... ఆ లైన్‌లో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఇదంతా 


జరిగిన తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చారు. ఏమీ జరగలేదనీ, ఆ వ్యక్తి నిద్ర మత్తులో కరెంటు స్తంభం ఎక్కాడని తెలిసి... వాళ్లూ ఆశ్చర్యపోయారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని లైట్‌గా తీసుకోలేదు. నిద్ర మత్తు పేరుతో నాటకాలు ఆడుతున్నాడని, అలా విద్యుత్త స్తంభాన్నెక్కడం నేరం కాబట్టి... చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెబుతూ అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. స్థానికులు మాత్రం ‘అతనికి నిద్రలో నడిచే అలవాటున్నట్లు మాకు తెలీదు’ అని చెబుతున్నారు. 


అతను మాత్రం ‘అమ్మతోడు... నిద్రమత్తులోనే ఎక్కా’ననే చెబుతున్నాడు. ఇప్పడీ విషయం సోషల్ మీడియాలో వైరలవుతోంది.  


Updated Date - 2020-02-03T21:41:26+05:30 IST