13 నుంచి 18 వరకు గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ బంద్‌

ABN , First Publish Date - 2020-07-10T17:33:55+05:30 IST

గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజులపాటు

13 నుంచి 18 వరకు గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ బంద్‌

విద్యాధరపురం(కృష్ణా) : గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌లోనూ, పరిసర ప్రాంతాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజులపాటు హోల్‌సేల్‌ మార్కెట్‌ను పూర్తిగా మూసివేస్తున్నట్లు విజయవాడ హోల్‌సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ మెంబర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రకటించింది. ఈ ఆరు రోజులు గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ గేట్లు మొత్తం మూసివేస్తామని, ఈ కాంప్లెక్స్‌లో ఎలాంటి వ్యాపార లావాదేవీలు, ఎగుమతి దిగుమతులు ఉండవని ఆ సొసైటీ కోశాధికారి కొత్తమూరు వెంకట రామయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంప్లెక్స్‌లోని హోల్‌సేల్‌ వ్యాపారులంతా ఈ ఆరు రోజులు స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్‌ పాటించి సహకరించాలని ఆయన కోరారు

Updated Date - 2020-07-10T17:33:55+05:30 IST