Abn logo
Oct 17 2021 @ 02:26AM

గొల్లప్రోలులో కుంభవృష్టి

గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారులో 216వ జాతీయ రహదారిపై అడుగున్నర ఎత్తున ప్రవహిస్తున్న వర్షపు నీరు

 జాతీయరహదారిపై ప్రవహిస్తున్న వర్షపునీరు

గొల్లప్రోలు రూరల్‌, అక్టోబరు 16: గొల్లప్రోలు పట్టణంతోపా టు మండలంలోని గ్రామాల్లో శనివారం కుంభవృష్టి కురిసింది. శనివారం సాయంత్రం రెండు గంటలపాటు రాత్రి మరో రెండు గంటలపాటు కురిసిన వర్షాలతో ఎక్కడికక్కడ వర్షపునీరు చేరిం ది. పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. శనివారం రాత్రి 9.30 గంట ల సమయంలో మండలంలోని చేబ్రోలు ఆదర్ష్‌ ఇంజనీరింగ్‌ కళాశాలవద్ద 216వ జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. ప్రస్తుతం అడుగున్నర ఎత్తులో వర్షపునీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరుగుతుండడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు, హైవే మొబైల్‌ పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. వాహనదారులను ముందుగానే నిలిపివేసి సూచనలు ఇచ్చి పంపిస్తున్నట్లు సీఐ రాత్రి 11గంటలకు తెలిపారు.