Abn logo
Mar 2 2021 @ 18:08PM

భారీగా పడిపోయిన బంగారం ధరలు!

న్యూఢిల్లీ: మంగళవారం నాడు బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. దేశరాజధానిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 679 మేరకు తగ్గి రూ. 44,760కి చేరుకుంది. అదేవిధంగా వెండి ధరలకు కూడా భారీగా దిగివచ్చాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 1874 మేర తగ్గి రూ.68,920కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్, డాలర్‌తో పోలిస్తే బలపడ్డ రూపాయి కారణంగా బంగారం ధరలు దొగొచ్చినట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1719డాలర్ల వద్ద, ఔన్స్ వెండి  26.08 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గతం కొంత కాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు తాజాగా 45 వేల రూపాలయల మార్కు దిగువకు చేరుకున్నాయి. భవిష్యత్తులో వీటి ధరలు మరింత తగ్గేఅవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement