ట్రాఫిక్ పోలీస్ ఇంట్లో.. బంగారం టాయిలెట్.. ఆశ్యర్యపోతున్న అధికారులు!

ABN , First Publish Date - 2021-07-25T06:27:50+05:30 IST

లక్షలు లంచం తీసుకోవడానికి కొందరు ప్లాన్ చేశారు. ఈ విషయం ఎలాగో కొందరు ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది.

ట్రాఫిక్ పోలీస్ ఇంట్లో.. బంగారం టాయిలెట్.. ఆశ్యర్యపోతున్న అధికారులు!

మాస్కో: లక్షలు లంచం తీసుకోవడానికి కొందరు ప్లాన్ చేశారు. ఈ విషయం ఎలాగో కొందరు ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో వాళ్లు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా రష్యాలోని ట్రాఫిక్ పోలీసు విభాగంలో ఉన్నతాధికారుల అవినీతి కుంభకోణం. ఈ ఉన్నతాధికారులు ఒక్కొక్కరి ఇళ్లపై పోలీసు అధికారులు రెయిడ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వెల్లడైన విషయం అందరికీ షాకిచ్చింది. అదేంటంటే.. ట్రాఫిక్ పోలీసు విభాగంలో ఉన్నతాధికారి అయిన కోల్ అలెక్సీ సాఫనోవ్ అనే వ్యక్తి ఇంట్లో టాయిలెట్‌కు బంగారం తాపడం చేసి ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను దర్యాప్తు అధికారులు విడుదల చేయడంతో అందరూ నోరెళ్లబెట్టారు.

Updated Date - 2021-07-25T06:27:50+05:30 IST