సౌదీ నుంచి వచ్చిన విమానం.. ఇద్దరు ప్రయాణికులపై అనుమానం.. తనిఖీ చేస్తే..

ABN , First Publish Date - 2020-11-27T16:56:37+05:30 IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గురువారం 369 గ్రాముల బంగారం పట్టుబడింది. వాటి విలువ రూ.18 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ అధికారుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

సౌదీ నుంచి వచ్చిన విమానం.. ఇద్దరు ప్రయాణికులపై అనుమానం.. తనిఖీ చేస్తే..

శంషాబాద్ విమానాశ్రయంలో 369 గ్రాముల బంగారం పట్టివేత


శంషాబాద్(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గురువారం 369 గ్రాముల బంగారం పట్టుబడింది. వాటి విలువ రూ.18 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ అధికారుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సౌదీ రాజధాని రియాద్ నుంచి వస్తున్న విమానంలో ప్రయాణికులు బంగారాన్ని తెస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టగా ఇద్దరు ప్రయాణికులు ప్యాంట్లకు ప్రత్యేకంగా కుట్టించిన జేబుల్లో బంగారం బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 


ఇటివల గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమనాల ద్వారా బంగారం అక్రమ రవాణా మరింత ఎక్కువయింది. దీంతో కస్టమ్స్ అధికారులు నిఘా పెంచారు.. అక్రమ రవాణా చేసేవాళ్లు కూడా పలు వింత వింత మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రత్యేకంగా కుట్టించిన బ్యాగుల్లో బయటకు బంగారం కనిపించకుండా తీసుకొస్తున్నారు. అలాగే ప్రయాణికుల చెప్పుల్లోనూ, వాచిల్లోనూ.. టూత్‌పేస్టుల్లోనూ.. ఇలా ఒకటేమిటి... అనేక విధాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమ్స్ అధికారులు నిఘా పెంచి మరీ వారిని పట్టుకుంటున్నారు. 

Updated Date - 2020-11-27T16:56:37+05:30 IST