Abn logo
Sep 23 2021 @ 08:19AM

లోదుస్తుల్లో బంగారం స్మగ్లింగ్‌..

                           - విమాన ప్రయాణికుడి అరెస్టు


అడయార్‌(చెన్నై): చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ విమాన ప్రయాణికుడు లోదుస్తుల్లో దాచిపెట్టి తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి చెన్నైకు ఎమిరేట్స్‌ విమాన సంస్థకు చెందిన ఓ విమానం బుధవారం వచ్చింది. ఈ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు తన వద్ద కస్టమ్స్‌ పన్ను చెల్లించే వస్తువులేవీ లేవని అధికారులకు చెప్పారు. దీంతో ఆ ప్రయాణికుడిని అనుమానించిన అధికారులు అతనిని తనిఖీ చేసి అతడు లోదుస్తుల్లో కనిపించకుండా దాచిన 583 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.27 లక్షలు. దీంతో ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

క్రైమ్ మరిన్ని...